: ఏపీ వ్యవసాయ బడ్జెట్ హైలైట్స్ - 2


నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి వ్యవసాయ బడ్జెట్ ను వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు శాసనసభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగంలోని ప్రధానాంశాలు ఇవే... * రైతులకు రూ. 3 లక్షల వరకు పావలా వడ్డీకే రుణం * విభజన తర్వాత కూడా కోడిగుడ్ల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్నాం * మాంసం ఉత్పత్తిలో నాలుగో స్థానంలో ఉన్నాం * మత్స్య ఉత్పత్తుల విలువలో దేశంలోనే తొలి స్థానంలో ఉన్నాం * ఆయిల్ పామ్ సాగుకు రూ. 33 కోట్లు * ఎత్తిపోతల పథకాలకు రూ. 156 కోట్లు * రాష్ట్రంలో 4.04 లక్షల మంది మత్స్యకారులు ఉన్నారు * మత్స్యశాఖకు రూ. 60.07 కోట్లు * పట్టు ఉత్పత్తిలో ముందుండేందుకు కృషి * పట్టు పరిశ్రమకు రూ. 122 కోట్లు * గోదాములలో నిల్వ ఉంచిన పంటలపై రైతులకు రుణం * బిందు సేద్యానికి రూ. 348.33 కోట్లు * ఐసీడీపీకి రూ. 156. 87 కోట్లు * 2014-15లో వ్యవసాయ రుణాల లక్ష్యం రూ. 56,019 కోట్లు * వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు రూ. 50 కోట్లు * వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్శిటీకి రూ. 30.61 కోట్లు * రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద పశు సంవర్ధక శాఖకు రూ. 51.84 కోట్లు * రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద కోళ్ల పరిశ్రమకు రూ. 17 కోట్లు * ఐజీసీఏఆర్ఎల్ కు రూ. 15 కోట్లు * రైతు బజార్లు, పండ్ల మార్కెట్లలో కోల్డ్ స్టోరేజ్ లు * రైతులకు 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ కు కృషి * విద్యుత్ పై రైతుల ఫిర్యాదులు స్వీకరించేందుకు టోల్ ఫ్రీ నెంబర్ * వచ్చే ఐదేళ్లలో కొత్తగా 10 వేల సోలార్ పంపుసెట్లు

  • Loading...

More Telugu News