: ఏపీ వ్యవసాయ బడ్జెట్ హైలైట్స్ - 1
నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి వ్యవసాయ బడ్జెట్ ను వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు శాసనసభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగంలోని ప్రధానాంశాలు ఇవే... * ప్రణాళిక వ్యయం రూ. 6735 కోట్లు * ప్రణాళికేతర వ్యయం రూ. 6373 కోట్లు * రైతు రుణమాఫీకి రూ. 5 వేల కోట్లు * ప్రతి రైతు కుటుంబానికి లక్షన్నర రూపాయల రుణమాఫీ * ఇక్రిశాట్ సహకారంతో ప్రతి గ్రామంలో భూసార పరీక్షలు * వ్యవసాయం, అనుబంధ రంగాలకు పెద్దపీట * విత్తన సరఫరా రాయితీకి రూ. 212 కోట్లు * పావలా వడ్డీకి రూ. 230 కోట్లు * వ్యవసాయ విశ్వవిద్యాలయం అభివృద్ధికి రూ. 192 కోట్లు * ఉత్పాదకత పెంపుదలకు రూ. 153.23 కోట్లు * యాంత్రీకరణకు రూ. 90 కోట్లు * సమగ్ర ఉద్యాన అభివృద్ధికి రూ. 34 కోట్లు * ఉద్యాన విశ్వవిద్యాలయానికి రూ. 30 కోట్లు * పట్టు పరిశ్రమ అభివృద్ధికి రూ. 122 కోట్లు * నాణ్యమైన విత్తన సరఫరాకు రూ. 2,015 కోట్లు * వెంకటేశ్వర పశు వైద్య విశ్వ విద్యాలయానికి రూ. 112 కోట్లు * పశుగణ అధునాతన పరిశోధన కేంద్రానికి రూ. 15 కోట్లు * పశుసంవర్ధక శాఖకు రూ. 723 కోట్లు * హైబ్రీడ్ కూరగాయల విత్తన సరఫరాకు రూ. 34.46 కోట్లు * ఉపాధి హామీ పథకానికి రూ. 1,386 కోట్లు * సహకారశాఖకు రూ. 156 కోట్లు * రైతుల ఉచిత విద్యుత్ కు రూ. 3,188 కోట్లు * సమగ్ర ఉద్యాన అభివృద్ధి మిషన్ కు రూ. 34 కోట్లు