: ఆటోలో తీసుకువెళుతున్న మూడు కేజీల బంగారం, 42 లక్షల నగదు స్వాధీనం


ఆటోలో తీసుకువెళుతున్న మూడు కిలోల బంగారం బిస్కట్లను, 42 లక్షల రూపాయలను బెంగళూరు గ్రేహౌండ్స్ పోలీసులు పట్టుకున్నారు. నిన్న రాత్రి కంటోన్మెంట్ రైల్వే స్టేషన్‌కు వెళుతున్న ఆటోను ఆనందరావు సర్కిల్ వద్ద నాకాబందీ నిర్వహిస్తున్న గ్రేహౌండ్స్ పోలీసులు అడ్డుకుని తనిఖీ చేసి షాక్ తిన్నారు. బెంగళూరు నుంచి తమిళనాడులోని కోయంబత్తూరుకు 3 కేజీల బంగారం బిస్కెట్లు, 42 లక్షల రూపాయల నగదును పట్టుకున్నారు. ఆటోలో ప్రయాణిస్తున్న కోయంబత్తూరుకు చెందిన నటరాజ్, బాల, రాంకుమార్ల వద్ద ఉన్న సూట్‌కేసుల్లో ఇవి లభ్యం కాగా, వాటికి సంబంధించి ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో అక్రమ బంగారం, నల్లధనంగా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని విచారిస్తున్నారు.

  • Loading...

More Telugu News