: మహిళల రక్షణ కోసం నిర్భయ స్కూటర్లు


ఇండో-జపనీస్ ఎలక్ట్రిక్ టూవీలర్ కంపెనీ మారెల్లో యమాసకి ప్రత్యేకించి భారతీయ మహిళల కోసం ఓ ఎలక్ట్రిక్ స్కూటర్‌‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ స్కూటర్‌కు కంపెనీ 'నిర్భయ' అనే పేరును ఖరారు చేసింది. మహిళల భద్రత కోసం ఇన్-బిల్ట్ కమ్యూనికేషన్ సిస్టమ్(జీపీఆర్‌ఎస్ ఎనేబుల్ ట్రాకింగ్ సిస్టమ్) ఉండడం ఈ స్కూటర్ ప్రత్యేకత. ఈ స్కూటర్ మహిళలకు ఎలా రక్షణ ఇస్తుందంటే... నిర్భయ స్కూటర్లలో జీపీఆర్ఎస్ సిస్టమ్ ఉంటుంది. స్కూటర్ లో ఉన్న జీపీఆర్ఎస్ ను ఓ ప్రత్యేకమైన యాప్ ద్వారా వాహనం నడుపుతోన్న మహిళ మొబైల్ కు అనుసంధానం చేస్తారు. ఈ స్కూటర్‌లో ఎస్ఓఎస్ అనే బటన్ కూడా ఉంటుంది. ఈ ఎస్ఓఎస్ బటన్ జీపీఆర్ఎస్ ద్వారా మహిళా రైడర్ ఫోన్‌తో కనెక్ట్ అయి ఉంటుంది. ఆ బటన్‌ను ప్రెస్ చేయగానే ఏకకాలంలో ఆరు విభిన్న మొబైల్ నెంబర్లకు మెసేజ్‌లు ఆటోమేటిక్‌గా పంపబడుతాయి. ఈ బటన్‌ను నొక్కగానే, సదరు స్కూటర్ ఏ ప్రాంతంలో ఉందనే సమాచారం ప్రతీ రెండు మూడు నిమిషాలకు సదరు మహిళ కుటుంబసభ్యులకు ట్రాన్స్ ఫర్ అవుతుంటుంది. మరో రెండు నెలల్లో మార్కెట్ లోకి విడుదలవనున్న ఈ స్కూటర్ ధర రూ.35,000 ఉండొచ్చని కంపెనీ సీఈవో రజత్. ఆర్.ఆర్య చెబుతున్నారు. మహిళా కొనుగోలుదారులకు 10 శాతం డిస్కౌంట్‌ను ఇవ్వాలని ఆలోచిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ స్కూటర్ గరిష్ట వేగం 35 కిమీ అని.... దీనికి డ్రైవింగ్ లెసైన్స్ అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News