: హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో టీఆర్ఎస్ ఎంపీలు భేటీ
కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో ఢిల్లీలో టీఆర్ఎస్ ఎంపీలు సమావేశమయ్యారు. ఉమ్మడి హైదరాబాదులో శాంతి భద్రతలపై గవర్నర్ కు అధికారాలు అప్పగించనుండడంపై ఆయనతో చర్చిస్తున్నారు. దీనిపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటనచేసి, లేఖ రాసినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. కానీ, విభజన చట్టం ప్రకారం నడుచుకోవాల్సిందేనని, యూపీఏ హయాంలోనే ఇలా అధికారాలు ఇస్తూ చట్టం చేశారని స్పష్టం చేసింది. అయినా వెనక్కి తగ్గని తెలంగాణ సర్కార్ అధికారాలపై పట్టుబడుతోంది.