: విద్యుత్ శాఖ అధికారిని నిర్బంధించిన స్థానికులు
అడ్డూ అదుపూ లేని విద్యుత్ కోతలను నిరసిస్తూ నల్గొండ జిల్లా నడిగూడెం గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో విద్యుత్ శాఖకు చెందిన ఓ అధికారిని నిర్బంధించారు. విద్యుత్ సరఫరాను మెరుగుపరచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పరిస్థితిలో మార్పు రాకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.