: నాలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఉప ఎన్నికల పోలింగ్
దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో ఈరోజు ఉప ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. బీహార్ లో పది, కర్ణాటక, మధ్యప్రదేశ్ లో చెరి మూడు, పంజాబ్ లో రెండు అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం ఎనిమిది గంటల సమయంలో పోలింగ్ అంతగాలేనప్పటికీ తర్వాత నుంచి కొంతమేర పుంజుకున్నట్లు సమాచారం. లోక్ సభ ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీతో ఘన విజయం సాధించిన బీజేపీ ఈ ఎన్నికల్లోనూ గెలుపు తమదేనని నమ్ముతోంది. ఇటీవల పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అమిత్ షా నాలుగు రాష్ట్రాల్లో ప్రచారం కూడా చేశారు. మరి ఎంతవరకు ఆయన హవా పనిచేస్తుందనేది చూడాలి. మరోవైపు బీహార్ లో రెండు దశాబ్దాల తర్వాత కలసిన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, జేడీ(యూ) నేత నితీశ్ కుమార్ ఉమ్మడిగా ప్రచారం చేశారు. బీజేపీని ఎలాగైనా మట్టికరిపించి విజయం సాధించాలని, సాధిస్తామని విశ్వసిస్తున్నారు.