: అగ్ని ప్రమాదంలో నలుగురు వ్యక్తుల సజీవ దహనం
తమిళనాడులో గురువారం తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో నలుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. రాష్ట్రంలోని తిరువళ్లూరులో గురువారం తెల్లవారుజామున ఓ ప్లాస్టిక్ గోడౌన్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో గోడౌన్ ను చుట్టుముట్టాయి. అగ్ని ప్రమాదం సంభవించిన సమయంలో గోడౌన్ లో నిద్రిస్తున్న నలుగురు కార్మికులు సకాలంలో మేల్కొనలేకపోయారు. తెల్లవారుజాము సమయం కావడం, శారీరక శ్రమ కారణంగా అలసిపోయిన కార్మికులు మంటలను గుర్తించేలోగానే, వారిని అగ్ని కీలలు దహించివేశాయి. అగ్ని ప్రమాదంపై పోలీసుల ద్వారా సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది గోడౌన్ లో మంటలను అదుపులోకి తెచ్చారు.