: సర్వే ఎఫెక్ట్: పేరు నమోదు చేయలేదని సెల్ టవర్ ఎక్కేశాడు!


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నాడు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే కోసం ప్రజలందరూ ఇంటి వద్దనే వేచి చూశారు. హైదరాబాదులో ఆ రోజున ఆర్టీసీ బస్సులు తిరగలేదు, బ్యాంకులు తెరవలేదు, పెట్రోల్ బంకులు తీయలేదు, హోటళ్లు తెరచుకోలేదు... సామాన్యుడికి చివరికి టీ కూడా దొరకని పరిస్థితి. ఒక్క మాటలో చెప్పాలంటే జనజీవనం స్తంభించింది. దీంతో, ప్రజల్లో సర్వేపై ఒకింత ఆసక్తి, మరోవైపు అయోమయం నెలకొన్నాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాదులో సర్వేలో పేరు నమోదు చేయలేదని ఓ వ్యక్తి హల్ చల్ చేశాడు. జే యాకుబ్ అనే వ్యక్తి తన పేరు సర్వేలో రిజిస్టర్ చేయలేదంటూ ఏకంగా సెల్ టవర్ ఎక్కేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని అతడికి నచ్చజెప్పి కిందకి దింపారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కి తరలించారు. దీంతో కొద్దిసేపు నడిచిన ఉత్కంఠకు తెరపడింది.

  • Loading...

More Telugu News