: అమీర్ చెప్పినట్టు ఆ పోస్టర్ లో టేప్ రికార్డర్ అడ్డం లేదు!
టేప్ రికార్డర్ అడ్డం లేకుండా 'పీకే' రెండో పోస్టర్ విడుదల చేశాడు బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్. పీకే ఫస్ట్ లుక్ పోస్టర్ తో మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. రైలు పట్టాలపై టేప్ రికార్డర్ అడ్డం పెట్టుకుని నగ్నంగా నిలబడిన అమీర్ ఖాన్ ను అనేక కేసులు, వివాదాలు చుట్టుముట్టాయి. వాటికి ఏమాత్రం బెదరని అమీర్ పబ్లిసిటీ కోసం ఆ పోస్టర్ విడుదల చేయలేదని.. సినిమా చూస్తే అంతా అర్థమవుతుందని తెలిపాడు. పనిలో పనిగా ఆగస్టు 20వ తేదీన విడుదల చేసే రెండవ పోస్టర్ లో టేప్ రికార్డర్ కూడా అడ్డుగా ఉండదంటూ చమత్కరించాడు. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. పీకే రెండో పోస్టర్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూశారు. అనుకున్నట్టే అమీర్ ఖాన్ అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఈ మధ్యాహ్నం విడుదల చేసిన పీకే సెకండ్ లుక్ పోస్టర్ లో అమీర్ ఖాన్ నిండుగా బట్టలేసుకుని ట్రంపెట్ పట్టుకుని నిలుచున్నాడు. దీంతో అమీర్ ను బట్టలేసుకోవాలని విమర్శలు గుప్పించిన షారూఖ్ ఖాన్ వంటి వారు ఏమంటారో చూడాలి!