: ఐదు రోజుల్లో వంద కోట్లు వసూలు చేసిన 'సింగం రిటర్న్స్'
బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ నటించిన 'సింగం రిటర్న్స్' సినిమా కలెక్షన్లలో దూసుకుపోతోంది. కేవలం ఐదు రోజుల్లో రూ. 100 కోట్లను వసూలు చేసింది. ఇప్పటి వరకు బాలీవుడ్ లో అనేక సినిమాలు రూ.100 కోట్లను వసూలు చేసినప్పటికీ... కేవలం ఐదు రోజుల్లోనే ఈ రికార్డు సాధించిన తొలి చిత్రంగా 'సింగం రిటర్న్స్' చరిత్ర సృష్టించిందని విశ్లేషకులు అంటున్నారు. 'సింగం రిటర్న్స్' కలెక్షన్ల వివరాలు... తొలి రోజు రూ.32.09 కోట్లు, రెండో రోజు రూ.21.05 కోట్లు, మూడో రోజు రూ.24.55 కోట్లు, నాలుగో రోజు రూ.14.78 కోట్లు, ఐదో రోజు రూ.8.21 కోట్లు.