: నా నుంచి అద్భుతాలు ఆశించవద్దు: రవిశాస్త్రి


కుక్ సేనతో టెస్టు సిరీస్ లో దారుణంగా భంగపడ్డ టీమిండియాకు మాజీ కెప్టెన్ రవిశాస్త్రిని డైరక్టర్ గా నియమించడం తెలిసిందే. తన నియామకంపై ఈ పొడగరి మాట్లాడుతూ, తన నుంచి ఇప్పటికిప్పుడు అద్భుతాలేవీ ఆశించవద్దని పేర్కొన్నాడు. ప్రస్తుతం తాను ఇంగ్లండ్ గడ్డపై మనవాళ్ళ దుస్థితికి కారణాలను విశ్లేషించే పనిలో ఉన్నానని తెలిపాడు. భవిష్యత్ లో పూర్తిస్థాయి కోచ్ గా బాధ్యతలు చేపడతారా? అన్న ప్రశ్నకు జవాబిస్తూ "భవిష్యత్ పై ఇప్పుడేమీ మాట్లాడలేను. ప్రస్తుతం కోచ్ ఫ్లెచర్ తో కలిసి పనిచేస్తున్నాను. లార్డ్స్ లో అద్భుత విజయాన్ని నమోదు చేసిన జట్టు వరుసగా మూడు మ్యాచ్ లు ఎలా కోల్పోయిందన్న విషయాన్ని కనుగొనాలి. ఎందుకలా జరిగిందన్న విషయం తెలుసుకోవాలని బీసీసీఐ లాగే నేనూ ఉత్సుకతతో ఉన్నాను" అని పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News