: 18 ఏళ్ల క్రితం తప్పిపోయి... శవమై ఇంటికి చేరిన సైనికుడు


18 ఏళ్ల క్రితం తప్పిపోయిన సైనికుడు...ఇన్నేళ్ల తరువాత శవంగా ఇంటికి చేరాడు. జమ్ము కాశ్మీర్లోని సియాచిన్ ప్రాంతంలో ఎప్పుడో 18 ఏళ్ల క్రితం ఓ సైనికుడు తప్పిపోయి తాజాగా శవంగా బయటపడ్డాడు. 15 రాజ్ పుత్ రెజిమెంటుకు చెందిన హవల్దార్ గయా ప్రసాద్ 1996లో సియాచిన్ గ్లేసియర్ ప్రాంతం వద్ద తప్పిపోయాడు. అతడి మృతదేహం గ్లేసియర్ సాధారణ ప్రాంతంలో మంచు కింద కప్పబడిపోయి, తాజాగా కనిపించింది. దానిని స్వాధీనం చేసుకున్నామని సీనియర్ ఆర్మీ అధికారి వెల్లడించారు. అతడి ఆచూకీ గుర్తించి స్వస్థలమైన ఉత్తర ప్రదేశ్లోని మైన్పురి ప్రాంతానికి మృతదేహాన్ని పంపామన్నారు. గ్లేసియర్ ప్రాంతంలో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. దీంతో ఇన్నేళ్లయినా మృతదేహం ఏమాత్రం చెక్కు చెదరలేదు. ఇక్కడ సాధారణ ఉష్ణోగ్రత మైనస్ 45 డిగ్రీలుంటుంది. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయి.

  • Loading...

More Telugu News