: ఎంపీలను బందీలుగా పట్టుకోవాలని పిలుపునిచ్చిన పాక్ మత గురువు
పాకిస్థాన్ లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళన చేపట్టిన మత గురువు తాహిర్ ఉల్ ఖాద్రి నిరసనకారులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఎంపీలను బందీలుగా పట్టుకోవాలని పిలుపునిచ్చారు. తాహిర్ నేతృత్వంలో ఆందోళన చేపడుతున్న ప్రజలు ప్రధాని నవాజ్ షరీఫ్ గద్దె దిగిపోవాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాహిర్ ఇస్లామాబాద్ లో ప్రసంగిస్తూ, షరీఫ్ రాజీనామా చేసేవరకు ఎంపీలను పార్లమెంటు దాటి బయటికి అడుగుపెట్టనీయరాదని సూచించారు. ఈ సాయంత్రంలోగా షరీఫ్ పదవి నుంచి తప్పుకోవాలని తాహిర్, తెహ్రీకే ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ అల్టిమేటం జారీచేయడం తెలిసిందే.