: మూడు గండాల నుంచి గట్టెక్కిన ఎయిర్ ఇండియా


ఎయిర్ ఇండియా మంగళవారం నాడు మూడు గండాలను ఎదుర్కొంది. ఒక్కరోజులో మూడు విమానాలు ప్రమాదం నుంచి తప్పించుకోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున దుబాయ్ నుంచి ఢిల్లీ బయల్దేరిన విమానానికి కీలక మరమ్మతు అవసరమవడంతో... ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి మరమ్మతులను చేపట్టారు. ఈ డ్రీమ్ లైనర్ విమానంలో 239 మంది ప్రయాణికులున్నారు. ఢిల్లీ నుంచి బెంగళూరు బయల్దేరిన మరో డ్రీమ్ లైనర్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో లోపాలను సరిదిద్దిన అనంతరం రెండు గంటలు ఆలస్యంగా బయల్దేరింది. ఇక మూడో సమస్య ఈ రెండింటి కన్నా ప్రమాదకరమైనది. గోవా నుంచి చెన్నై వెళ్తున్న విమానంలో విండ్ షీల్డ్ లో పగుళ్లు ఏర్పడ్డాయి. అయితే, ఈ విండ్ షీల్డ్ ప్రయాణం ముగిసేవరకూ విమానాన్ని కాపాడింది. ఈ విధంగా మూడు గండాల నుంచి గట్టెక్కడంతో ఎయిర్ ఇండియా అధికారులు ‘థాంక్ గాడ్’ అనుకున్నారు.

  • Loading...

More Telugu News