: యూకేలో 'పర్యావరణ హిత' హిందూ దేవాలయం
దేవాలయాలు సైతం పర్యావరణ పరిరక్షణకు అనుగుణంగా నిర్మితమవుతున్నాయి. ఈ కోవలో ప్రపంచంలోనే తొలిసారిగా యూకేలో ఓ హిందూ దేవాలయాన్ని పర్యావరణ హితాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్మించారు. వాయవ్య లండన్ లో ఉన్న శ్రీస్వామి నారాయణ్ మందిరాన్ని రూ.200 కోట్ల వ్యయంతో రూపొందించారు. ముఖ్యంగా, ఈ ఆలయంలో విద్యుచ్ఛక్తి కోసం సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. పైభాగంలో అమర్చిన సోలార్ ప్యానెళ్ళు అవసరాలకు తగినంత సౌరశక్తిని గ్రహించి బ్యాటరీలకు అందిస్తాయి. ఇక, నీటి అవసరాల కోసం జల సంరక్షణ విధానాలను అనుసరించారు. వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. బారత సంప్రదాయ నిర్మాణశైలి అనుసరించి ఈ 'గ్రీన్' మందిరాన్ని నిర్మించారు. ఆచార్య స్వామిశ్రీ మహరాజ్ ఈ ఆలయాన్ని మంగళవారం ప్రారంభించారు.