: కాపలా లేని క్రాసింగ్ ల వద్ద రైల్వే గేట్లు ఏర్పాటు చేయిస్తాం: యనమల
రోడ్డు ప్రమాదాల నివారణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని బడ్జెట్ ప్రసంగంలో యనమల అన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి అవసరమైన అన్ని భద్రతా చర్యలు తీసుకోవాల్సిందిగా రవాణా శాఖకు ఆదేశాలు జారీ చేయనున్నామన్నారు. అలాగే... కాపలా లేని రైల్వే క్రాసింగ్ ల వద్ద రైల్వే గేట్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.