: భారత సెలబ్రిటీలను కదిలించిన 'ఐస్ బకెట్ చాలెంజ్'
అమెరికాలో ప్రారంభమైన 'ఐస్ బకెట్ చాలెంజ్' తాజాగా భారత్ లోనూ సెలబ్రిటీలను కదిలించింది. ఏఎల్ఎస్... అమియోట్రోపిక్ లేటరల్ స్కెలెరోసిస్ (నాడీ సంబంధ వ్యాధి)పై చైతన్యం కలిగించేందుకు ఈ ఐస్ బకెట్ చాలెంజ్ నిర్వహిస్తున్నారు. ఇందులో పాల్గొనేవారు బకెట్ లోని చల్లటి నీళ్ళను తలపై గుమ్మరించుకోవాలి. అలా చేయలేకపోతే, 100 డాలర్లను ఏఎల్ఎస్ అసోసియేషన్ కు విరాళమివ్వాలి. కాగా, ఐస్ బకెట్ చాలెంజ్ లో పాల్గొన్న వారిలో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ళ, ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకెర్ బర్గ్, పాప్ స్టార్ లేడీ గాగా, హాలీవుడ్ యాక్టర్ చార్లీ షీన్ తదితరులున్నారు. భారత్ లో ఐస్ బకెట్ పోటీలో పాల్గొన్న వారిలో టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, బాలీవుడ్ హీరో రితేశ్ దేశ్ ముఖ్ ఉన్నారు. దీనిపై రితేశ్ ట్విట్టర్లో స్పందిస్తూ, ఇతర బాలీవుడ్ నటులు కూడా ఈ చాలెంజ్ ను స్వీకరించాలంటూ 24 గంటల డెడ్ లైన్ విధించాడు.