: ధోనీ బతికిపోయాడు!
ఇంగ్లండ్ చేతిలో టెస్టు సిరీస్ పరాభవం నేపథ్యంలో విమర్శల జడివానలో తడిసి ముద్దవుతున్న టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఊరట. కెప్టెన్ గా ధోనీని తప్పించేది లేదని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) స్పష్టం చేసింది. బోర్డు కార్యదర్శి సంజయ్ పటేల్ మీడియాతో మాట్లాడుతూ, ధోనీపై వేటు వేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. గెలుస్తారనుకున్న సిరీస్ ను పేలవరీతిలో కోల్పోవడం పట్ల మాజీ క్రికెటర్లు ధోనీ నాయకత్వ సామర్థ్యాన్ని తూర్పారబట్టారు. టెస్టు సారథ్య బాధ్యతల నుంచి ధోనీని తప్పించాలని వారు సూచించారు. కానీ, బీసీసీఐ మాత్రం ఈ జార్ఖండ్ డైనమైట్ పై నమ్మకముంచింది. వన్డే వరల్డ్ కప్ కు మరో ఆరు నెలలు మాత్రమే ఉండడంతో కెప్టెన్ మార్పు జట్టుపై ప్రభావం చూపుతుందని బోర్డు వర్గాలు భావిస్తున్నాయి.