: కులం వివరాలు ఇచ్చేందుకు నిరాకరించిన దాసరి నారాయణరావు


తెలంగాణలో జరిగిన సమగ్ర సర్వే విజయవంతం అయింది. సర్వే కోసం వచ్చిన ఎన్యూమరేటర్లకు కొందరు పూర్తి వివరాలు అందిస్తే, మరికొందరు కొన్ని వివరాలు మాత్రమే అందించారు. కేంద్ర మాజీ మంత్రి, దర్శకరత్న దాసరి నారాయణరావు కులం వివరాలు ఇచ్చేందుకు నిరాకరించారు. కులానికి సంబంధించిన సమాచారాన్ని అడిగిన ఎన్యూమరేటర్లపై దాసరి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. కులం ముఖ్యం కాదని... ఆ కాలమ్ వదిలివేయాలని ఎన్యూమరేటర్లకు సూచించారు. దీంతో, కులానికి సంబంధించిన కాలమ్ లో ఏదీ రాసుకోకుండానే సర్వేను పూర్తి చేశారు ఎన్యూమరేటర్లు.

  • Loading...

More Telugu News