: నేడు ఢిల్లీకి గవర్నర్... కేంద్రానికి పలు నివేదికల సమర్పణ
గవర్నర్ నరసింహన్ నేడు ఢిల్లీకి బయల్దేరి వెళుతున్నారు. రెండు రోజుల పాటు కొనసాగనున్న తన పర్యటనలో... రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ లను ఆయన కలుసుకునే అవకాశం ఉంది. ఇరు రాష్ట్రాల పరిస్థితులు, హైదరాబాద్ లో తాజా పరిస్థితి తదితర వివరాలను కేంద్రానికి వివరించేందుకు ఆయన హస్తిన వెళుతున్నారు. దీనికి తోడు, ఇటీవల ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ ల సమావేశానికి సంబంధించిన వివరాలను కూడా కేంద్రానికి విన్నవించనున్నట్టు సమాచారం. హైదరాబాద్ పై గవర్నర్ కు అధికారాల కేటాయింపుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసిన అనంతరం నరసింహన్ తొలిసారి ఢిల్లీ వెళుతున్నారు. దీంతో, ఆయన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.