: పవన్ కల్యాణ్ తెలంగాణ రాష్ట్రంలో టూరిస్టుగానే ఉండాలనుకుంటున్నాడా?: కేసీఆర్


భారతదేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో సమగ్ర కుటుంబ సర్వే జరిగిందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. సర్వేలో భాగంగా సామాన్య ప్రజలతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, జూనియర్ ఎన్టీఆర్ లాంటి సినీరాజకీయ ప్రముఖులు కూడా సర్వేలో వివరాలు నమోదు చేసుకున్నారని కేసీఆర్ తెలిపారు. పవన్ కల్యాణ్ సర్వేలో పాల్గొనలేదని ఓ విలేకరి ప్రస్తావించినప్పుడు... పవన్ కల్యాణ్ తెలంగాణలో ఉండదలుచుకోలేదేమోనని... కేవలం టూరిస్టుగానే తెలంగాణలో ఉండదలుచుకున్నాడేమోనని కేసీఆర్ వ్యాఖ్యానించారు. సమగ్ర సర్వేలో వివరాలు ఇవ్వకపోతే అది వారి కర్మని ఆయన ఘాటుగా కామెంట్ చేశారు.

  • Loading...

More Telugu News