: ఉద్యోగాల పేరిట టోపీ పెట్టిన ముఠా అరెస్టు...ముఠాలో సినీ దర్శకుడు
పోలీసు శాఖలో ఉద్యోగాల పేరిట మోసాలకు పాల్పడిన ఒక ముఠాను విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. ఐదుగురు సభ్యులున్న ఈ ముఠా సభ్యులు పోలీసు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి సుమారు 17 లక్షల రూపాయలు వసూలు చేశారని పోలీసులు తెలిపారు. పట్టుబడిన ముఠాలో సినీ దర్శకుడు ఇంద్రగంటి సైదులు కూడా ఉన్నట్టు సమాచారం. ఆ దర్శకుడు ఈ మధ్యే 'కూల్ బాయ్స్ హాట్ గాల్స్' సినిమాకు దర్శకత్వం వహించారు.