: జగన్ ఫెయిల్ అయ్యాడు... ఓడిపోయినా మార్పు రాలేదు: అచ్చెన్నాయుడు
వైకాపా పైన, ఆ అధిపార్టీ నేత జగన్ పై మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. సభలో వైకాపా వ్యవహరిస్తున్న తీరును ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. వైకాపా తీరును ఎండగడతామని చెప్పారు. ప్రజాసమస్యలను చర్చించడంలో వైకాపా విఫలమయిందని అన్నారు. ఇంత ఘోరమైన ప్రతిపక్షాన్ని ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంతవరకు చూడలేదని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నేతగా జగన్ పూర్తిగా ఫెయిల్ అయ్యారని అన్నారు. హత్యారాజకీయాలు చేయాల్సిన అవసరం టీడీపీకి లేదని వెల్లడించారు. సభ విధివిధానాలు తెలుసుకుని అసెంబ్లీకి వస్తే గౌరవంగా ఉంటుందని వైకాపా సభ్యులకు చురక అంటించారు. ఓడిపోయినా జగన్ లో మార్పు రాలేదని... ఇంకా ప్రతి విషయాన్ని ఫ్యాక్షనిస్టు ధోరణిలోనే చూస్తున్నారని ఆరోపించారు.