: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు అంటూ తనపై దుష్ప్రచారం చేస్తున్నారు: అల్లు అర్జున్


అర్ధరాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో భాగంగా బంజారాహిల్స్ పోలీసులు తనపై బ్రీత్ అనలైజర్ పరీక్షలు జరిపిన ఉందంతంపై ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ స్పందించాడు. జరిగింది వేరు... మీడియాలో వచ్చింది వేరని ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాకుండా, జరిగిన విషయాన్ని వివరించాడు. అర్ధరాత్రి సమయంలో బ్రీత్ అనలైజర్ లో ఊదమని పోలీసులు అడిగారని చెప్పాడు. మీడియా కెమెరాలు ఉన్నాయని... వారిముందు తనకు చాలా అసౌకర్యంగా ఉంటుందని తెలిపానని... దీంతో మీడియా వారిని పోలీసులు పక్కకు తీసుకెళ్లారని అల్లు అర్జున్ తెలిపాడు. ఆ తర్వాత బ్రీత్ అనలైజర్ పరీక్ష జరిగిందని... తాను మద్యం సేవించలేదని పరీక్షలో తేలిందని స్పష్టం చేశాడు. మద్యం సేవించి నడిపే వారిని హైదరాబాదు పోలీసులు వదలరని... తగిన చర్యలు తీసుకోవడమో లేదా జరిమానా విధించడమో చేస్తారని చెప్పాడు. ఈ విషయాలను పూర్తిగా తెలుసుకోకుండా... డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అల్లు అర్జున్ అంటూ పలు వెబ్ సైట్లలో వీడియోలను పోస్ట్ చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఒక వేళ తాను మద్యం సేవించినట్టైతే.. నడిచి వెళ్లడమో, మరొకరిని డ్రాప్ చేయమని అడగడమో, ట్యాక్సీ లేదా ఆటోలో వెళ్లడమో చేసేవాడినని చెప్పాడు.

  • Loading...

More Telugu News