: లెక్చరర్ వేధింపులపై హైకోర్టుకు లేఖ రాసిన యువతి
విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఆ గురువు ప్రేమ పాఠాలు చెబుతానంటూ వేధింపులకు దిగడంతో ఓ యువతి హైకోర్టును ఆశ్రయించిన ఘటన కర్నూలులో చోటు చేసుకుంది. కర్నూలులో ఓ కళాశాలలో ఎంబీఏ చదువుతున్న విద్యార్థినిని అదే కళాశాలలో పనిచేస్తున్న లెక్చరర్ ప్రేమ, పెళ్ళి పేరిట వేధిస్తున్నాడు. అంతేగాకుండా, మార్కుల వంకతో లైంగిక వేధింపులకూ పాల్పడడంతో ఆ విద్యార్థిని సహించలేకపోయింది. దీంతో, తన బాధలన్నింటిని ఏకరువుపెడుతూ మంగళవారం హైకోర్టుకు ఓ లేఖ రాసింది. ఈ లేఖపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్పందించారు. వారంలోగా పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.