: సర్వే ఎన్యూమరేటర్ పై ఎమ్మెల్యే అనుచరుడి అసభ్య ప్రవర్తన


తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వే కోసం వచ్చిన మహిళా ఎన్యూమరేటర్ పై టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడొకరు అసభ్యంగా ప్రవర్తించారు. సర్వేలో భాగంగా సోమవారం జూబ్లీ హిల్స్ పరిధిలోని ఎస్ పీఆర్ హిల్స్ లో ఎన్యూమరేటర్ సుల్తానా, ఇంటింటికి తిరిగి స్టిక్కర్లు పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపానాథ్ అనుచరుడు రాజు నాయుడు ఇంటికీ ఆమె వెళ్లారు. సర్వే చేయడానికి వీలు లేదని, తక్షణమే అక్కడినుంచి వెళ్లిపోవాలని రాజు నాయుడు, సుల్తానాను బెదిరించారు. ఈ సందర్భంగా అతడు సుల్తానాను దుర్భాషలాడాడు. సుల్తానా తల్లి అక్కడికి వచ్చి రాజు నాయుడును నిలదీయగా, ఆమెపైనా అతడు విరుచుకుపడ్డారు. దీంతో సుల్తానా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో రాజు నాయుడిపై కేసు నమోదు చేసిన జూబ్లీ హిల్స్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News