: గులాబీ దళపతి తొలి విదేశీ పర్యటన నేడే


తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంగళవారం సింగపూర్ బయలుదేరుతున్నారు. ఇందులో విశేషమేముందనేగా మీ డౌటు. రాజకీయాల్లో సుదీర్ఘ నేపథ్యమున్న కేసీఆర్ ఇప్పటిదాకా అసలు విదేశీ పర్యటనే చేయలేదట. తన ఇద్దరు సంతానం కేటీఆర్, కవితలు విదేశాల్లోనే సుదీర్ఘ కాలం ఉన్నా, కేసీఆర్ మాత్రం దేశం దాటి బయట కాలుపెట్టలేదట. అంతేకాదండోయ్.., ఎమ్మెల్యేగానే కాక ఎంపీ, రాష్ట్ర మంత్రి, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవులతో పాటు కేంద్ర మంత్రి పదవి కూడా చేపట్టిన కేసీఆర్ విదేశాలపై కాలుమోపలేదంటే ఆశ్చర్యం కాక మరేమిటి..? 2001లో తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించి, తెలంగాణ ఉద్యమాన్ని విస్తృతం చేసిన నేపథ్యంలో పలు దేశాల్లోని తెలంగాణ వాసులు కేసీఆర్ కు ఆహ్వానాలు పంపారు. అయితే వివిధ కారణాల నేపథ్యంలో కేసీఆర్ వాటిని అంగీకరించలేకపోయారు. విదేశాల్లో ఉన్న పిల్లలను కూడా చూసేందుకు కేసీఆర్ స్వదేశాన్ని వీడలేదు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్, తన విదేశీ పర్యటనను ప్రారంభిస్తుండటం గమనార్హం.

  • Loading...

More Telugu News