: సమగ్ర కుటుంబ సర్వే ఎఫెక్ట్, కర్ఫ్యూను తలపిస్తున్న హైదరాబాద్ రోడ్లు
సమగ్ర కుటుంబ సర్వే కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దైనందిన కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. పెట్రోల్ బంకులు, స్కూళ్లు, ఆఫీసులు, సినిమా హాళ్లు పూర్తిగా బంద్ అయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి తెలంగాణ ప్రజలు భారీగా సొంత ప్రాంతాలకు తరలడంతో... హైదరాబాద్ రోడ్లు కర్ఫ్యుా వాతావరణాన్ని తలపిస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కోటి కుటుంబాల వివరాలను ఈ సర్వే ద్వారా సేకరించనున్నారు.