: రానాను షాక్ గురి చేసిన కుర్రాడు


హీరో దగ్గుబాటి రానా అనగానే ఓ ఆజానుబాహుడు కళ్ల ముందు కదలాడుతాడు. అంతెత్తు పొడుగుతో, పొడవుకు తగ్గ ఫిజిక్ తో ఎక్కడికెళ్లినా ఆకట్టుకుంటాడు. అమితాబ్, సంజయ్ దత్ కంటే రానా పొడుగ్గా ఉంటాడని టాలీవుడ్ జనాలు చెబుతుంటారు. ఆ పొడుగుతోనే రానా ఏ ఫంక్షన్లో అయినా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తుంటాడు. అలాంటి రానాను ఇటీవల ఓ వేడుకలో షాక్ కు గురిచేశాడు ఓ కుర్రాడు. సాధారణ మనుషులకు రాణా చెయ్యెత్తు మనిషి, అలాంటి రానాకు ఆ కుర్రాడు చెయ్యెత్తు ఉన్నాడు. అతడ్ని చూసి అబ్బురపడిన రానా అతని వద్దకెళ్లి పరిచయం చేసుకుని మాట్లాడి... పోటో కూడా తీసుకున్నారు. అతని ముందు డేవిడ్ అండ్ గొలియత్ లా రానా కనబడ్డాడు.

  • Loading...

More Telugu News