: ‘సమగ్ర సర్వే’పై ఆందోళన వద్దు: రేమండ్ పీటర్
తెలంగాణ ప్రభుత్వం మంగళవారం నాడు చేపడుతున్న సమగ్ర కుటుంబ సర్వేపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని ఆ రాష్ట్ర పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్ అన్నారు. సర్వేపై ఆయన వివరణనిస్తూ... వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు సర్వే చేపట్టామని, సంక్షేమ పథకాల అమలుకు ఆయా శాఖలు మళ్లీ సర్వే చేస్తాయని తెలిపారు. సర్వేలో ప్రజలిచ్చిన సమాచారాన్ని ప్రభుత్వం నిర్థారించుకుంటుందని, ఎక్కడ నివాసం ఉంటే అక్కడే నమోదు చేయించుకోవాలని అన్నారు. సర్వే వల్ల వ్యక్తిగత స్వేచ్ఛకు ఎలాంటి భంగం కలుగదని ఆయన హామీ ఇచ్చారు.