: కృష్ణాజిల్లాలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు


కృష్ణాజిల్లాలోని పుణ్యక్షేత్రమైన నెమలిలోని వేణుగోపాలస్వామి ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి గోకులాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు. వేణుగోపాలస్వామి వారికి ప్రీతిపాత్రమైన తొమ్మిది రకాల ప్రసాదాలను నివేదించారు. ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన గోవింద నామ స్థూపాన్ని ఆవిష్కరించారు. జూలై 8వ తేదీన కృష్ణ దీక్షలు తీసుకున్న 40 మంది భక్తులు కృష్ణాష్టమి సందర్భంగా ఇరుముడి సమర్పించి దీక్షలు విరమించారు.

  • Loading...

More Telugu News