: సికింద్రాబాదులో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
సికింద్రాబాదులోని హరేరామ హరేకృష్ణ ఇస్కాన్ టెంపుల్ లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిన్నారులు చిన్నికృష్ణుని వేషధారణలో ఆకట్టుకున్నారు. పలువురు భక్తులు గోసేవలో పాల్గొన్నారు.