: సీఎంలిద్దరూ సమావేశమవ్వటం శుభపరిణామం: రాంమాధవ్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులిద్దరూ సమావేశం కావడం శుభపరిణామమని బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ అన్నారు. ఇరు రాష్ట్రాల్లో నెలకొన్న సమస్యలపై సీఎంలిద్దరూ మాట్లాడుకుంటే కేంద్రంపై భారం తగ్గుతుందన్నారు. సీఎంల భేటీ విషయంలో గవర్నర్ కృషి ప్రశంసనీయమని ఆయన అన్నారు. ఇలాంటి సమావేశాలు తరుచుగా జరగాలని కోరుకుంటున్నానని, సీఎంల భేటీ సమస్యల పరిష్కారానికి దోహదపడుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ అధ్యక్షుడిగా అమిత్ షా తొలి పర్యటన తెలంగాణలోనని, దీన్ని బట్టి బీజేపీ తెలంగాణకు ఇచ్చే ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చునని రాంమాధవ్ అన్నారు.