: ఓటమికి బోనస్ లా... టీమిండియాకు జరిమానా
చివరి టెస్టులో ఓటమిపాలైన ధోనీ సేనకు బోనస్ లా... ఓ మోస్తరు జరిమానా విధించారు. ఈ మ్యాచ్ సందర్భంగా భారత్ స్లో ఓవర్ రేట్ నమోదు చేసిందంటూ రిఫరీ రంజన్ మదుగళే జరిమానా కొరడా ఝుళిపించారు. కెప్టెన్ ధోనీ మ్యాచ్ ఫీజులో 60 శాతం, ఆటగాళ్ళ మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత విధించారు. ఓవల్ మ్యాచ్ లో నిర్ణీత సమయానికి టీమిండియా మూడు ఓవర్లు తక్కువగా విసిరింది. కాగా, తదుపరి 12 నెలల కాలంలో ధోనీ మరోసారి స్లో ఓవర్ రేట్ జరిమానాకు గురైతే, అతనిపై ఓ టెస్టు నిషేధం విధిస్తారు.