: ప్రపంచయుద్ధ అమరవీరులను ఓసారి స్మరించుకోండి: సచిన్
భారత్ తరపున తొలి ప్రపంచయుద్ధంలో పాల్గొని అమరులైన సైనిక వీరులను ఓసారి స్మరించుకుందామని క్రికెట్ ఐకాన్ సచిన్ టెండూల్కర్ జాతికి పిలుపునిచ్చారు. భారత అమరవీరుల స్మృత్యర్థం ఫ్రాన్స్ కు చెందిన జీఓపిఐవో సంస్థ చెన్నైలోని విక్టరీ వార్ మెమోరియల్ వద్ద ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో సచిన్ పాల్గొనకపోయినా ఓ వీడియో సందేశాన్ని వెలువరించారు. ఆనాటి ప్రపంచయుద్ధంలో పాల్గొన్న భారత సైనికుల సేవలను గుర్తిస్తూ, స్మరణకు తెచ్చుకోవాలని ఈ లెజెండరీ బ్యాట్స్ మన్ సూచించారు. కాగా, ఆగస్టు 15న జరిగిన ఈ కార్యక్రమానికి గైర్హాజరైన తమిళనాడు సీఎం జయలలిత తన తరపున ఓ పుష్పగుచ్ఛాన్ని పంపారు.