: మహిళా బ్యాంక్ ఉద్యోగులు కోరుకున్న చోటికి బదిలీ!
మహిళా బ్యాంక్ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇవ్వబోతోంది. ఉద్యోగ రీత్యా కోరుకున్న ప్రాంతానికి బదిలీ అయ్యే సదవకాశాన్ని ఇవ్వనుంది. ఈ మేరకు ట్రాన్స్ ఫర్ల విషయంలో అనుకూలంగా ఉండే ఓ పాలసీని తయారు చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బ్యాంకులను కోరింది. దీని ద్వారా భర్త లేదా తల్లిదండ్రులు నివసించే ప్రాంతంలో ఉద్యోగం చేసుకునేందుకు వీలుంటుందని అంటున్నారు. ఈ క్రమంలో వివాహమైన మహిళా ఉద్యోగులు భర్త ఉండే చోటికి లేదా దగ్గరలో ఉండే శాఖకు బదిలీ చేసేలా, అలాగే పెళ్లికాని వారు తల్లిదండ్రులు ఉండే చోటికి బదిలీ ఉండేలా అవకాశం ఇవ్వాలని ఆర్థిక సేవల విభాగం కోరింది. అంతేగాక ఇంతవరకు పెండింగ్ లో ఉన్న ఇలాంటి విజ్ఞప్తులను కూడా కొత్త నిబంధనల ప్రకారం పరిశీలించనుంది. దేశం మొత్తంలో ప్రస్తుతం 27 ప్రభుత్వరంగ బ్యాంకులు ఉన్నాయి. ఇందులో 2.5 లక్షల మంది మహిళా సిబ్బంది ఉన్నారు.