: ఏపీ శాసనసభ వాయిదా
తీవ్ర గందరగోళం మధ్య ఏపీ శాసనసభ 15 నిమిషాల పాటు వాయిదా పడింది. ఉదయం 9 గంటలకు సభ ప్రారంభం అయిన వెంటనే తామిచ్చిన 'శాంతిభద్రతల' తీర్మానంపై చర్చ జరగాలని వైకాపా సభ్యులు పట్టుబట్టారు. తీర్మానాన్ని తిరస్కరించిన స్పీకర్ కోడెల శివప్రసాద్... జీరో అవర్ లో దీనిపై చర్చిద్దామని చెప్పారు. అయినా పట్టు వీడని వైకాపా సభ్యులు... 'వియ్ వాంట్ జస్టిస్' అంటూ సభను హోరెత్తించారు. ఎట్టి పరిస్థితుల్లోను చర్చను చేపట్టేది లేదంటూ... సభ జరిగేందుకు సహకరించాలంటూ స్పీకర్ పదేపదే విన్నవించారు. అయినా, పరిస్థితిలో మార్పు రాకపోవడంలో సభను స్పీకర్ కోడెల 15 నిమిషాల పాటు వాయిదా వేశారు.