: సినీ,రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగిన సుబ్బరామిరెడ్డి మనమడి నిశ్చితార్థం
రాజ్యసభ సభ్యుడు టి. సుబ్బరామిరెడ్డి మనమడు రాజీవ్ నిశ్చితార్థ వేడుక ఆదివారం రాత్రి మాదాపూర్ హెచ్ఐసీసీలో ఘనంగా జరిగింది. సంప్రదాయ బద్ధంగా జరిగిన ఈ వేడుకలో వధూవరులు రాజీవ్, కావ్యలను పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు ఆశీర్వదించారు. ఈ వేడుకలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి, వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, నారా లోకేష్... సినీప్రముఖులు దాసరి నారాయణ రావు, శ్రీదేవి-బోనీకపూర్ దంపతులు, రాంచరణ్, వెంకటేష్, అఖిల్, స్నేహ తదితరులు హాజరయ్యారు. రాజీవ్ తల్లిదండ్రులు సందీప్ రెడ్డి, సరిత... కావ్య తల్లిదండ్రులు కోటరెడ్డి, సుప్రజ విచ్చేసిన ప్రముఖులకు ఆతిథ్యమందించారు.