: ఎన్టీఆర్ ఘాట్ లో నివాళి అర్పించిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ లో దివంగత ఎన్టీఆర్ కు నివాళి అర్పించారు. ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయన ఎన్టీఆర్ ఘాట్ ను సందర్శించారు. ఆయనతో పాటు పలువురు నేతలు కూడా ఎన్టీఆర్ కు నివాళి అర్పించారు. అనంతరం, ఘాట్ నుంచి ఆయన అసెంబ్లీకి బయలుదేరారు.