: ఇద్దరు సీఎంల భేటీతో అపోహలన్నీ దూరమయ్యాయి: టీఎస్ మండలి ఛైర్మన్ స్వామిగౌడ్


ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ లు భేటీ కావడంతో... ఇప్పటి వరకు నేతలు, ప్రజల్లో నెలకొన్న అపోహలన్నీ పటాపంచలు అయ్యాయని తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. ఈ భేటీ ఒక శుభసూచకం అని తెలిపారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించడం ఆనందంగా ఉందని చెప్పారు. ఇద్దరు ముఖ్యమంత్రుల కలయికతో ఇరు రాష్ట్రాలు అభివృద్ధి పథంలో పయనిస్తాయని వెల్లడించారు. సమగ్ర సర్వేపై ఎలాంటి అపోహలు పెట్టుకోరాదని... కేవలం తెలంగాణ బిడ్డల క్షేత్ర స్థాయి పరిస్థితి తెలుసుకునేందుకే ఈ సర్వే అని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News