: ఏపీ అసెంబ్లీలో తొలి రోజు మూడు ఆర్డినెన్సులు ప్రవేశపెట్టే అవకాశం


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి. సమావేశాల తొలి రోజునే ఏపీ ప్రభుత్వం మూడు ఆర్డినెన్సులను సభలో ప్రవేశపెట్టాలని భావిస్తోంది. వాటిలో మొదటిది... ఆంధ్రప్రదేశ్ పోలీసు సంస్కరణల ఆర్డినెన్స్-2014. దీన్ని సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశ పెడతారు. మిగిలిన రెండూ... వ్యవసాయ మార్కెట్ కమిటీలు, దేవాదాయ కమిటీలను రద్దుచేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్సులు. వీటిని సంబంధిత మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పైడికొండల మాణిక్యాలరావులు వేర్వేరుగా సభలో ప్రవేశపెడతారు. వీటికి తోడు... 10 అంశాలను సభ ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది. వాటిలో... విశాఖ పరిశ్రమల్లో భద్రతా చర్యలు, గిరిజన గురుకులాల ఆధ్వర్యంలో రెసిడెన్షియల్ స్కూళ్లు, ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక అమలు, తోటపల్లి రిజర్వాయర్, పురపాలక ఉపాధ్యాయుల సర్వీసు నిబంధనలు, రాష్ట్రంలో భూగర్భ జలాల పరిస్థితి, రిజర్వ్ ఫారెస్టులో మౌలిక వసతుల కల్పన, ముఖ్యమంత్రి సహాయనిధి కోసం వచ్చిన దరఖాస్తులు తదితర అంశాలు ఉన్నాయి. సభ సజావుగా కొనసాగితే... ఈ అంశాలకు సంబంధించి మంత్రులు సమాధానాలు చెప్పే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News