: 19న ఆర్టీసీ సహా ఏ రవాణా వ్యవస్థా పనిచేయదు: కేసీఆర్
ఈ నెల 19న సమగ్ర సర్వే జరుగుతున్న నేపథ్యంలో, ఆర్టీసీ సహా ఏ రవాణా వ్యవస్థ పనిచేయదని టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఆర్టీసీ బస్సులు సహా అన్ని రవాణా వ్యవస్థలను సర్వే పనుల కోసం ప్రభుత్వమే ఎంగేజ్ చేసుకుంటుందని చెప్పారు. ఏదైనా కారణాలతో ఆరోజు మిస్సైన వారి వివరాలను మళ్లీ తీసుకుంటామని తెలిపారు. సర్వే వల్ల ఆంధ్రావాళ్లను ఏరివేస్తామని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన కొట్టివేశారు. అది కేవలం అపోహ మాత్రమే అని చెప్పారు.