: సర్వేపై రాద్ధాంతం ఎందుకు?: కేసీఆర్


ఈ నెల 19న (మంగళవారం) తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన సర్వేపై కొందరు నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేసీఆర్ అన్నారు. సమాజంలో వాస్తవాలను తెల్సుకోవాలని ప్రభుత్వం అనుకుంటే తప్పేంటి? అని ఆయన ప్రశ్నించారు. సమాజం పట్ల బాధ్యత లేని వాళ్లే సర్వేని విమర్శిస్తున్నారని ఆయన అన్నారు. సర్వేతో వాస్తవాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంటే బీజేపీ, టీడీపీలకు అభ్యంతరం ఎందుకని ఆయన నిలదీశారు. సర్వే వల్ల అనేక ఉపయోగాలున్నాయని, సర్వేకు వీలైతే సహకరించాలని ఆయన విపక్షాలకు హితవు పలికారు. సంక్షేమ పథకాలు నిజమైన అర్హులకు అందేందుకే సర్వే నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో నిజమైన లబ్ధిదారుల కంటే 12 లక్షల తెల్ల రేషన్ కార్డులు అదనంగా ఉన్నాయని కేసీఆర్ అన్నారు. చారిత్రక గోల్కొండ కోటపై జెండా ఎగురవేస్తే దానిపై కూడా విమర్శలు చేశారని, పంద్రాగస్టు వేడుకల వల్ల గోల్కొండ కోటకు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించిందని ఆయన చెప్పారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్లలో 22 శాతం ఎస్సీ, ఎస్టీలకేనని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News