: రాజ్ భవన్ లో ముగిసిన చంద్రబాబు, కేసీఆర్ భేటీ
హైదరాబాదు రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ సమక్షంలో జరిగిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. దాదాపు గంటన్నర పాటు కొనసాగిన ఈ సమావేశంలో 12 అంశాలపై చర్చించినట్టు తెలిసింది. ఇరు రాష్ట్రాల్లో నెలకొన్న సమస్యలపై చంద్రబాబు, కేసీఆర్ చర్చించారు. ఈ భేటీలో ఇరు రాష్ట్రాల సీఎస్, స్పీకర్లతో పాటు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.