: హైదరాబాదులో కొనసాగుతున్న ప్రీ విజిట్ సర్వే
హైదరాబాదు నగరంలో ప్రీ విజిట్ సర్వే కొనసాగుతోంది. ఈ నెల 19వ తేదీన తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన ఇంటింటి సర్వేకు సంబంధించి ఎన్యూమరేటర్లు ఇంటింటికి తిరిగి ప్రీ విజిట్ సర్వే చేస్తున్నారు. సర్వే చేయనున్న ఇళ్లకు వారు సమగ్ర సర్వేకు సంబంధించిన స్టిక్కర్లు అంటించి వెళ్తున్నారు. ఈరోజు, రేపు ప్రీ విజిట్ సర్వే జరుగుతుంది. సర్వే చేసిన తర్వాత స్టిక్కర్లుపై సూచించిన చోట టిక్ చేస్తారు. సర్వే చేసేటప్పుడు అవసరమైన అడ్రస్ ప్రూఫ్, ఐడీ ప్రూఫ్ తదితర జిరాక్స్ కాపీలను సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.