: ఆర్టీసీకి రోజుకు 2.70 కోట్ల రూపాయల నష్టం వస్తోంది: మంత్రి శిద్ధా


ఆర్టీసీకి రోజుకు 2.70 కోట్ల రూపాయల నష్టం వస్తోందని ఆంద్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి శిద్ధా రాఘవరావు అన్నారు. ఆర్టీసీలో నష్టాలను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఒంగోలులో మంత్రి శిద్ధా మీడియాతో మాట్లాడుతూ... ఆర్టీసీలో ఇంధన పొదుపుపై దృష్టి సారించామని అన్నారు. త్వరలో కొత్త బస్సులను కొనుగోలు చేయనున్నట్లు ఆయన చెప్పారు. ప్రకాశం జిల్లాలోని రామాయపట్నంలో ఓడరేవును నిర్మిస్తామని ఆయన తెలిపారు. దొనకొండను ఇండస్ట్రియల్ కారిడార్ గా మారుస్తామని ఆయన అన్నారు. జిల్లా అభివృద్ధికి టీడీపీ కట్టుబడి ఉందని శిద్ధా స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News