: అయ్యో...కోడి ఎంత పని చేసింది


కోడి ఓ యువతిని కేసులో ఇరికించింది. పొదిలి ఆర్టీసీ డిపోకు చెందిన హైటెక్ బస్సు బెంగళూరు నుంచి పొదిలి వెళ్తూ నెల్లూరు జిల్లా సీతారాంపురం మండలం గుండుపల్లి హరిజనవాడ వద్దకు చేరుకుంది. ఇంతలో ఓ రాయి ఫెడీమని అద్దానికి తగిలింది. అంతే అద్దం భళ్లున పగిలిపోయింది. దీంతో డ్రైవర్ బస్సును నిలిపేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రయాణికులను దించేసి మరో బస్సులో గమ్యస్థానానికి తరలించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు వచ్చి ఆరా తీయగా, విసిగిస్తున్న కోడిని తరిమేందుకు ఓ యువతి రాయి విసిరిందట, ఆ రాయి బలంగా విసరడంతో బస్సు అద్దం పగిలిందట. అదీ విషయం. దీంతో కోడి కొంపముంచిందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News