: శంషాబాద్ ఎయిర్ పోర్టులో 2.5 కేజీల బంగారం సీజ్


అక్రమ మార్గాల్లో దేశంలోకి తరలివస్తున్న రెండున్నర కేజీల బంగారం ఆదివారం శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుబడింది. థాయ్ ల్యాండ్ రాజధాని బ్యాంకాక్ నుంచి ఆదివారం శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన బ్యాంకాక్ ఎయిర్ లైన్స్ విమాన ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓ ప్రయాణికుడి వద్ద రెండున్నర కిలోల బంగారం బయటపడింది. దీంతో బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు... సదరు బంగారాన్ని గుట్టుచప్పుడు కాకుండా తీసుకువస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News