: మీరట్ లో ఐఎస్ఐ ఏజెంటు అరెస్టు


పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) సంస్థకు సమాచారం చేరవేస్తున్నాడన్న అనుమానంతో ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. పక్కా సమాచారంతో దాడి చేసిన యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆసిఫ్ అలీ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి పెద్ద సంఖ్యలో కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో తాను ఐఎస్ఐ ఏజెంటునన్న విషయాన్ని అతను అంగీకరించాడని స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు. అతని వద్ద భారత్, పాకిస్థాన్ బ్యాంకులకు చెందిన పలు పాస్ పుస్తకాలు, డెబిట్ కార్డులు కూడా లభ్యం అయ్యాయి. తన భార్యాబిడ్డలు పాక్ లోనే ఉంటున్నారని అలీ విచారణ సందర్భంగా వెల్లడించినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. కుటుంబాన్ని కలిసే నెపంతో అలీ తరచూ పాక్ వెళ్ళేవాడని యూపీ అడిషనల్ డీజీపీ (శాంతిభద్రతలు) ముకుల్ గోయల్ చెప్పారు. ఏడెనిమిదేళ్ళ నుంచి అలీ ఐఎస్ఐతో సంబంధాలు నెరుపుతున్నాడని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News